Election Commissioners: కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

Central govt gets relief in Supreme Court over new election commissioner appointment
  • ఇటీవల ఇద్దరు ఈసీల నియామకం
  • కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సింగ్
  • గతంలో చట్ట సవరణ చేసిన కేంద్రం
  • చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు
  • ఈ చట్టంలో తాము జోక్యం చేసుకోలేమన్న అత్యున్నత న్యాయస్థానం

కేంద్రం ఇటీవల నూతన ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్ కు చెందిన సుఖ్ బీర్ సింగ్ లను నియమించింది. అయితే, ఈ నియామకాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. 

కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ దశలో ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 

సీఈసీ, ఈసీల ఎంపిక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ కు 2023లో కేంద్రం సవరణ చేసింది. ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పైవిధంగా పేర్కొంది.

  • Loading...

More Telugu News