Vijayasai Reddy: చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయాయి: విజయసాయిరెడ్డి

These are Chandrababu last elections says Vijayasai Reddy
  • చంద్రబాబు వంటి వ్యక్తికి ఓటు వేయొద్దన్న విజయసాయి
  • చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్య
  • లోకేశ్ ని ప్రమోట్ చేయడమే ఆయన అజెండా అని ఎద్దేవా
టీడీడీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ఆయన జీవితంలో మంచి రోజులు అయిపోయాయని... తన కొడుకు లోకేశ్ ని ప్రమోట్ చేయడం, రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు ఆయన ఏకైక అజెండా అని అన్నారు. తన ఆకాంక్షలే చచ్చిపోతే ఏపీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరని ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపును తీసుకురాగల స్థిరమైన యువ నాయకుడు కావాలని చెప్పారు. 

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News