Jayaprakash Narayan: లోక్ సత్తా జేపీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్

Nara Lokesh thanked Loksatta founder Jayaprakash Narayan
  • ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు పలికిన జేపీ
  • ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని పిలుపు
  • జేపీ ప్రకటన హర్షణీయం అంటూ లోకేశ్ ట్వీట్

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు దిగజారాయని, ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని జేపీ పిలుపునిచ్చారు. 

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన జయప్రకాశ్ నారాయణ వంటి మేధావి ఏపీ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలకడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ వంతు పాత్రను పోషించేందుకు ముందుకు రావడం పట్ల మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సర్ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News