Arthur: ఎమ్మెల్యే ఆర్థర్ చేరిక కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం: షర్మిల

Sharmila welcomes Nandikotkur MLA Arthur into Congress party
  • వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే ఆర్థర్
  • నేడు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
  • ఆర్థర్ చేరిక కాంగ్రెస్ కు కొత్త బలాన్ని అందిస్తుందన్న షర్మిల

నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆర్థర్ చేరికపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"కాంగ్రెస్ తరఫున నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అందుకు సంతోషిస్తున్నాను. ఆయన రాజకీయ అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన కాంగ్రెస్ పార్టీకి కొత్త బలాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యే ఆర్థర్ చేరిక ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణకు, నమ్మకానికి నిదర్శనం. కొత్త రెక్కలతో, మరింత శక్తితో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పుంజుకుంటోంది అనే నిజాన్ని ఈ చేరిక నిరూపిస్తోంది" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News