Kadiam kavya: ప్రజల గొంతుకగా ఢిల్లీలో మాట్లాడుతాను: వరంగల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య

Kadiyam Kavya says she will fight for interests of warangal
  • బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ అన్న కడియం కావ్య
  • బీజేపీ కొత్తగా వచ్చిన పార్టీ ఏమీ కాదు... పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం
  • కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వారి నాయత్వం ప్రకారం నడుచుకుంటారని విమర్శ
  • కేసీఆర్‌కు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు తప్ప వేరే లేదని వ్యాఖ్య
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్ సభ నుంచి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల గొంతుకగా ఢిల్లీలో మాట్లాడుతానని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా తనను గెలిపించమని ప్రజలందరినీ వేడుకుంటున్నానన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏర్ప‌డిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

బీజేపీ కొత్తగా వచ్చిన పార్టీ ఏమీ కాదని... గత పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు వారి నాయత్వం ప్రకారం నడుచుకుంటారని... వారికి తెలంగాణ ప్రయోజనాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రయోజనాలు తప్ప వేరే అవసరం లేదన్నారు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమించి సాధించారని ప్రశంసించారు.
Kadiam kavya
Telangana
Warangal Urban District
BRS

More Telugu News