Chilakaluripeta: చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్‌ కు సీఎంవో నుంచి పిలుపు

Chilakaluripeta YSRCP leader Rajesh meets Jagan
  • మంత్రి రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చానని ఆరోపించిన రాజేశ్
  • రాజేశ్ ను పిలిపించి మాట్లాడుతున్న జగన్
  • ఇటీవల చిలకలూరిపేట ఇన్ఛార్జీగా రాజేశ్ ను తొలగించిన వైనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది. చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కోసం మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేస్తే రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో రాజేశ్ ను పిలిపించి జగన్ మాట్లాడుతున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇన్ఛార్జీగా వైసీపీ నాయకత్వం రాజేశ్ ను తప్పించింది. ఆయన స్థానంలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును ప్రకటించారు.

  • Loading...

More Telugu News