Atchannaidu: టీడీపీ నేత మూలయ్యను వైసీపీ కార్యకర్తలు దారుణంగా నరికి చంపారు: అచ్చెన్నాయుడు

YSRCP workers murdered TDP leader Mulaiah says Atchannaidu
  • చిలకలూరి పేట సభకు జనాలను తరలించాడని మూలయ్యను హత్య చేశారన్న అచ్చెన్న
  • వైసీపీకి గొడ్డలి గుర్తును కేటాయించాలని వ్యాఖ్య
  • వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని విమర్శ
గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నేత మూలయ్యను వైసీపీ వర్గీయులు అత్యంత దారుణంగా నరికి చంపారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ రాక్షస జాతికి చెందిన పార్టీ అని విమర్శించారు. మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తమ కార్యకర్తలు, నేతలపై దాడులు చేసిన వారిని, హత్యలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

చిలకలూరి పేట ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించాడనే అక్కసుతో మూలయ్యను గొడ్డలితో నరికి చంపారని అచ్చెన్న అన్నారు. సొంత బాబాయ్ ని గొడ్డలితో నరికి చంపిన నాయకులను వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి, గొడ్డలి గుర్తును ఈసీ కేటాయించాలని అన్నారు. మూలయ్యను హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూలయ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.
Atchannaidu
Telugudesam
Mulaiah
Murder
YSRCP

More Telugu News