Singer Mangli: యాక్సిడెంట్ పై సోషల్ మీడియాలో స్పందించిన గాయని మంగ్లీ

Singer Mangli reacts on accident news
  • మంగ్లీకి యాక్సిడెంట్ అంటూ వార్తలు
  • అయితే అది చిన్న యాక్సిడెంట్ అని చెప్పిన మంగ్లీ 
  • పైగా అది రెండ్రోజుల క్రితం జరిగిందని స్పష్టీకరణ
  • ఇన్ స్టాగ్రామ్  లో పోస్టు
టాలీవుడ్ గాయని మంగ్లీ ఓ రోడ్డు ప్రమాదానికి గురైనట్టు ఇవాళ వార్తలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా... హైదరాబాద్- బెంగళూరు రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ డీసీఎం ఢీకొట్టింది... ఈ ఘటనలో మంగ్లీకి స్వల్ప గాయాలయ్యాయని ఆయా కథనాల సారాంశం. 

ఈ వార్తలపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని వెల్లడించారు. ఇది ఊహించని విధంగా జరిగిన చిన్న యాక్సిడెంట్ అని, ఇది జరిగి కూడా రెండ్రోజులు కావొస్తోందని మంగ్లీ వివరించారు. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మంగ్లీ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
Singer Mangli
Accident
Rumors
Hyderabad
Tollywood

More Telugu News