నందిగామలో టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు
- వారితోపాటు పలువురు కిందిస్థాయి నేతలు కూడా..
- కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక
- ఎన్నికల ముందు వైసీపీని వీడుతున్న నేతలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇద్దరు కౌన్సిలర్లు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు.