Ch Malla Reddy: మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు.. యూనివర్శిటీలో ఉద్రిక్తత

Tension at Malla Reddy University
  • మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత
  • 60 మంది విద్యార్థులను డీటైన్ చేయడమే కారణం
  • విద్యార్థులకు మద్దతుగా నిలిచిన మైనంపల్లి హన్మంతరావు
హైదరాబాద్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో, వీరంతా ధర్మాకు దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మరోవైపు యూనివర్శిటీలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. 

Ch Malla Reddy
Mallareddy University

More Telugu News