నిజామాబాద్ లో కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకూ సోకే ముప్పు
- గ్రామాల్లో పదుల సంఖ్యలో వైరస్ బారిన పడ్డ కుక్కలు
- పుండ్లు, చీముతో వీధుల్లో తిరుగుతున్న వైనం
- భయభ్రాంతులకు గురవుతున్న జనం
- ఛత్తీస్ గఢ్ లోనూ వ్యాపిస్తున్న వైరస్
అధికారులు స్పందించి వెంటనే ఆ కుక్కలను తరలించాలని కోరుతున్నారు. పల్తితండాలో పార్వో వైరస్ బారిన పడ్డ కుక్కల బెడద ఎక్కువగా ఉందని తండా వాసులు చెబుతున్నారు. తండాలో దాదాపు డెబ్బై కుక్కల వరకు ఉన్నాయని, వాటిలో సగానికి పైగా కుక్కలు వైరస్ బారిన పడ్డాయని తెలిపారు. వాటి వల్ల మనుషులకూ వైరస్ అంటుకుంటుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో వీధి కుక్కలకు పార్వో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పలు జిల్లాలోని పశువైద్యశాలల్లో ప్రతిరోజూ 4 నుంచి 5 కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.