NATO: అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధం అడుగుదూరమే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Will Be One Step Away From World War 3 says Putin On Russia and NATO Conflict
  • నాటో దళాలు, రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదన్న పుతిన్
  • ఈ పరిణామాన్ని ఎవరూ కోరుకోరని వ్యాఖ్య
  • రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన వ్లాదిమిర్ పుతిన్
అమెరికా నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమి, రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలుస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా, నాటో దళాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని, అదే జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం అడుగుదూరంలో ఉంటుందని పశ్చిమ దేశాలను ఆయన సోమవారం హెచ్చరించారు. నాటో దళాలు, రష్యా మధ్య యుద్ధం ముప్పు పొంచివుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వ్యాఖ్యానించారంటూ పుతిన్ వద్ద మీడియా ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో అన్నీ సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.

మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని తాను భావిస్తున్నానని పుతిన్ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే నాటో సైనిక సిబ్బంది ఉన్నప్పటికీ.. యుద్ధంపై చర్చించేందుకు ఫ్రాన్స్, ఇంగ్లండ్‌లను ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదని పుతిన్ చెప్పారు.

కాగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు, రష్యా మధ్య సంబంధాలు అథమ స్థాయికి సన్నగిల్లాయి. 1962లో క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత తిరిగి ఇప్పుడే ఈ విధమైన పరిస్థితి నెలకొంది.
NATO
World War 3
Russia
Vladimir Putin
Ukraine
Ukraine war

More Telugu News