K Kavitha: రేపు కవితను కలవనున్న భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు

Anil ktr and harish rao to meet kavitha tomorrow
  • ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అవకాశమిచ్చిన కోర్టు
  • కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్న కుటుంబ సభ్యులు
  • కవితకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించిన న్యాయస్థానం

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, ప్రణీత్, న్యాయవాదులు రేపు సాయంత్రం కలిసే అవకాశముంది. కవితను రౌస్ అవెన్యూ కోర్టు శనివారం వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆమెను కలిసేందుకు కోర్టు అవకాశమిచ్చింది. దీంతో కవితను కలిసేందుకు అనిల్, కేటీఆర్, హరీశ్ రావులు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కోర్టు నిర్దేశించిన సమయంలో వారు కలుస్తారు.

  • Loading...

More Telugu News