YS Sharmila: ఒకే వేదికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల

Revanth Reddy and Sharmil on one state
  • 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' పేరుతో విశాఖలో కాంగ్రెస్ సభ
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
  • షర్మిలతో కలిసి కార్యకర్తలకు అభివాదం చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఒకే వేదికపై కనిపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' పేరుతో కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ఏపీ నాయకులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సభకు రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సభావేదిక మీదికి వచ్చిన సమయంలో ఏపీ కాంగ్రెస్ కేడర్ కేరింతలు కొట్టింది. వేదిక మీదకు వచ్చిన రేవంత్ రెడ్డి... తనతో పాటు షర్మిల చేయిని కూడా పైకెత్తి సభకు వచ్చిన వారికి అభివాదం చేశారు.
YS Sharmila
Revanth Reddy
Andhra Pradesh
Telangana
Congress

More Telugu News