pasunoori dayakar: కేసీఆర్‌కు షాక్... కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ దయాకర్

Pasunoori Dayakar joins congress
  • శనివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరిన దయాకర్
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ
  • శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన పసునూరి దయాకర్
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్‌కు షాకిచ్చారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పసునూరి దయాకర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. దానం నాగేందర్ కూడా నిన్న సీఎంను కలిశారు. అరగంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
pasunoori dayakar
Warangal Rural District
BRS
Congress

More Telugu News