Amitabh Bachchan: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అమితాబ్.. వీడియో ఇదిగో!

BiG B Amitab Clarity About His Health
  • అనారోగ్యంపై క్లారిటీ ఇస్తూ బిగ్ బీ వీడియో
  • అవన్నీ ఫేక్ వార్తలేనంటూ వివరణ
  • ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన అమితాబ్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇవన్నీ ఫేక్ వార్తలేనట.. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీ యే చెప్పారు. ఈమేరకు థానేలో జరుగుతున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు శనివారం దాదోజి కొండదేవ్ స్టేడియానికి బిగ్ బీ వచ్చారు. అక్కడ తనను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ.. తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు. పూర్తి ఎనర్జిటిక్ గా కనిపించిన అమితాబ్.. మ్యాచ్ చూసేందుకు తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో కలిసి స్టేడియానికి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బిగ్ బి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

మార్చి 15న అమితాబ్ అస్వస్థతకు గురయ్యారని, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని ప్రచారం జరిగింది. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడ్డాయని, వైద్యులు చికిత్స చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పుకార్లు వెలువడడంతో బిగ్ బీ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తాజాగా తమ అభిమాన నటుడి వివరణ వీడియో చూశాక ఫ్యాన్స్ కుదుటపడ్డారు.
Amitabh Bachchan
Big B
Health
Viral Videos
Amitabh Health

More Telugu News