కాసేపట్లో ఇడుపులపాయకు జగన్.. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం
- వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న జగన్
- ఈ రోజు ప్రకటించబోయే అభ్యర్థులే ఫైనల్
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. అన్ని వర్గాలకు అవకాశం ఉండేలా జాబితాను తయారు చేసినట్టు చెపుతున్నారు. మరోవైపు ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.