KTR: కవిత అరెస్టు.. కేటీఆర్‌పై ఈడీ ఫిర్యాదు

ED officials complain against KTR for obstructing their duties
  • బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు
  • కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ
  • ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ మహిళా అధికారి భానుప్రియా మీనా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ మహిళా అధికారి భానుప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కవిత అరెస్టు సమయంలో ఈడీ అధికారులపై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రసారమాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి.
KTR
Enforcement Directorate
K Kavitha
Kavitha Arrest
Delhi Liquor Scam

More Telugu News