వైభవంగా వెంకటేశ్ కుమార్తె వివాహ వేడుక
- వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహినికి విజయవాడ డాక్టర్ కుమారుడు నిషాంత్ తో వివాహం
- రామానాయుడు స్టూడియోలో వేడుక
- పెళ్లికి హాజరైన బంధువులు, శ్రేయోభిలాషులు
గతేడాది అక్టోబర్‌లో నిషాంత్, హయవాహినిల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబు, రానా, నాగచైతన్య హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. వెంకటేశ్, నీరజ దంపతులకు కుమార్తెలు ఆశ్రిత, హయవాహిని, భావన, కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు.