K Kavitha: కవితను విమానాశ్రయానికి తరలించిన ఈడీ.. రేపు ఢిల్లీలో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం.. వీడియో ఇదిగో

ED officials taking Kavitha to Shamshabad airport
  • సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ ప్రకటన
  • మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్టు వెల్లడి
  • రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో దాదాపు ఐదు గంటల సేపు సోదాలు జరిపి, విచారణ జరిపిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. కవిత నివాసం నుంచి నాలుగు వాహనాల్లో ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. రాత్రి 8.45 గంటలకు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. ఢిల్లీకి తరలించేందుకు సాయంత్రమే ఫ్లైట్ టికెట్లను బుక్ చేశారు. ఈ రాత్రికి కవిత ఈడీ అదుపులోనే ఉంటారు. మనీలాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.

రేపు మధ్యాహ్నం ఆమెను ఈడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తన నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. కవితను తరలిస్తున్న సమయంలో కవిత భర్త, పిల్లలతో పాటు కేటీఆర్, హరీశ్ రావు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. కవితను తరలించిన వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరి కొందరు అధికారులు ఉన్నారు. భారీ భద్రత మధ్య కవితను ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నారు.
K Kavitha
BRS
New Delhi
Arrest
Enforcement Directorate
Delhi

More Telugu News