బీఆర్ఎస్ కు భారీ షాక్.. ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఈడీ
- ఐదు గంటలుగా కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ
- బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో కవిత నివాసం వద్ద ఉద్రిక్తత
ఈ క్రమంలో కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన ఈడీ అధికారులు... ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై కాసేపట్లో ఈడీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కవిత నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఇంటి నుంచి బయటకు తీసుకొస్తే... ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.