BTech Ravi: వైఎస్ వివేకాపై నేను గెలిచినప్పటికీ.. ఆయన నాతో బాగా మాట్లాడేవారు: బీటెక్ రవి

YS Vivekananda Reddy used to speak to me well says says BTech Ravi
  • వివేకా హత్య వెనుక తమ హస్తం ఉందని నింద వేశారన్న బీటెక్ రవి
  • వివేకా సంస్మరణ సభకు పులివెందులలో ఫంక్షన్ హాల్ ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపాటు
  • వివేకా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్  
వైఎస్ వివేకాను హత్య చేయడమేకాక... హత్య వెనుక తమ హస్తం ఉందని తొలుత అన్యాయంగా నింద వేశారని టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వివేకా 5వ వర్ధంతి సందర్భంగా కడపలో ఈరోజు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సభకు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, ఆదినారాయణ రెడ్డిలతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సభలో బీటెక్ రవి ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

సంస్మరణ సభను పులివెందులలోనే నిర్వహించాలని వివేకా కుటుంబ సభ్యులు భావించారని... అయితే, సభకు ఒక ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారని బీటెక్ రవి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సభను కడపలో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసని చెప్పారు. వివేకాపై తాను పోటీ చేసి గెలిచినప్పటికీ ఆయన తనతో ఎంతో బాగా మాట్లాడేవారని తెలిపారు. వివేకాను హత్య చేయడంపై పులివెందుల వాసిగా తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు.
BTech Ravi
Telugudesam
YS Vivekananda Reddy
AP Politics

More Telugu News