Vanteru Venugopal Reddy: వైసీపీకి మరో షాక్.. రాజీనామా చేయనున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డి

YSRCP Ex MLA Vanteru Venugopal Reddy resigning to PARTY
  • 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన వంటేరు
  • పార్టీలో సరైన గుర్తింపు లభించలేదనే అసంతృప్తిలో వంటేరు
  • టీడీపీలో చేరాలని నిర్ణయం
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన నేతలు టీడీపీలో చేరారు. తాజాగా జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈరోజే ఆయన రాజీనామా ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వేణుగోపాల్ రెడ్డి పని చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా తనకు సరైన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తిలో ఆయన ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు.
Vanteru Venugopal Reddy
YSRCP
Telugudesam
Chandrababu

More Telugu News