BRS: నాగర్ కర్నూలులో బీఎస్పీ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తాం: బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు

Guvvala Balaraju says will support bsp nagarkurnool mp candidate
  • నాగర్ కర్నూల్ లోక్ సభ సీటును బీఎస్పీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడి
  • లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు 
  • బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలను కేటాయించిన కేసీఆర్
పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ లోక్ సభ సీటును బీఎస్పీకి ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ గువ్వల బాలరాజు అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. 17 లోక్ సభ స్థానాలకు గాను బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలను కేటాయించారు. కేసీఆర్ నిర్ణయంపై గువ్వల బాలరాజు స్పందించారు. కేసీఆర్‌ నిర్ణయాన్ని శిరసావహిస్తూ బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ గెలుపునకు కృషి చేస్తామన్నారు.
BRS
BJP
BSP
Telangana
Lok Sabha Polls

More Telugu News