MS Dhoni: ఎంఎస్ ధోనీపై అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు

 Will not be surprised if MS Dhoni play in IPL 2025 says Anil Kumble
  • ఐపీఎల్ 2024లో కచ్చితంగా ఆడతాడని అభిప్రాయపడ్డ దిగ్గజ లెగ్ స్పిన్నర్
  • 2025 ఐపీఎల్ ఆడినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని వ్యాఖ్య
  • జియో స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కుంబ్లే
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీకి ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ ఎడిషన్ చివరిదని, చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ధోనీ కచ్చితంగా ఆడగలడని, ఐపీఎల్ 2025లో కూడా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కుంబ్లే వ్యాఖ్యానించాడు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ అందుకు అతడు సిద్ధంగా లేడని తాను భావిస్తున్నట్టు మాజీ లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. జియో స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఎంఎస్ ధోనీ అందరితో కలిసిపోవాలని కోరుకునే ఆటగాడని, ఈ విషయంలో ధోనీ, సచిన్ టెండూల్కర్ ఒకటేనని కుంబ్లే పోల్చాడు. ఐపీఎల్‌లో తానెప్పుడూ ఎంఎస్ ధోనీతో ఆడలేదని, అయితే భారత జట్టులో ఆడేటప్పుడు తనను పైకి లేపిన మొదటి వ్యక్తి ధోనీయే అని కుంబ్లే గుర్తుచేసుకున్నాడు. భారీ బరువు ఎత్తడంలో ధోనీ అత్యంత బలవంతుడని తాను భావిస్తున్నానని, అతడు తనను గాల్లోకి ఎత్తిన క్షణాలు అద్భుతమైనవని అన్నాడు. 
MS Dhoni
IPL
IPL2024
Cricket
Anil Kumble

More Telugu News