Madhya Pradesh Congress: మధ్యప్రదేశ్‌లో బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ల క్యూ.. నేడు మరో ఇద్దరు జంప్!

Another shock to congress in Madhya Pradesh another two seniors joins BJP today
  • లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు
  • వారం రోజుల క్రితమే పార్టీని వీడిన ఇద్దరు సీనియర్లు
  • నేడు బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్న మరో ఇద్దరు నేతలు
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరి, మాజీ ఎమ్మెల్యేలు సంజయ్ సుక్లా, విశాల్ పటేల్ పార్టీని వీడి వారం కూడా కాకముందే మరో ఇద్దరు సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇండోర్ జిల్లాలోని ఎంహౌ (డాక్టర్ అంబేద్కర్ నగర్) నుంచి రెండుసార్లు గెలిచిన అంతార్ సింగ్ దర్బార్, 1998, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన పంకజ్ సంఘ్వి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తాను బీజేపీలో చేరబోతున్నట్టు సంఘ్వీ నిన్న ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి సీనియర్లను ఎలా గౌరవించాలో తెలియడం లేదని, అందుకనే పార్టీ మారుతున్నట్టు చెప్పారు. నేడు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
Madhya Pradesh Congress
Suresh Pachauri
Sanjay Shukla
Antar Singh Darbar
Pankaj Sanghvi
Vishal Patel
BJP

More Telugu News