టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- డీఎస్సీ కంటే ముందే నిర్వహించుకునే విధంగా జీవో ఇచ్చిన ప్రజా ప్రభుత్వం
- దీంతో 3 లక్షల మంది నిరుద్యోగులకు మేలు
- సాధ్యమైనంత ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం అభిప్రాయం
తెలంగాణలో ఇప్పటికే మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుందనడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజలు, నిరుద్యోగుల ఆలోచనలను కాంగ్రెస్ ప్రభుత్వం వింటోందని మరోసారి రుజువైందని ట్వీట్ చేసింది.