Mamata Banerjee: తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో మమతా బెనర్జీ... అసలేమైంది?

Mamata Banarjee suffers with major injury and hospitalised
  • నుదుట రక్తపుగాయంతో మమతా బెనర్జీ
  • ఓ ప్రమాదంలో  గాయపడ్డారంటున్న టీఎంసీ వర్గాలు
  • కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎం ఆసుపత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తలకు బలమైన గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నుదుట గాయమైన స్థితిలో ఉన్న మమతా బెనర్జీ ఆసుపత్రి బెడ్ పడుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. గాయం నుంచి రక్తం స్రవిస్తుండగా, మమతా అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఆ ఫొటో చెబుతోంది. ఓ ప్రమాదంలో మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారని, ఆమెను కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని టీఎంసీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మా నాయకురాలి కోసం ప్రార్థించండి అంటూ టీఎంసీ తన ట్వీట్ లో పేర్కొంది.

కోల్ కతా కాళీ ఘాట్ లోని తన నివాసంలో మమతా బెనర్జీ జారిపడినట్టు తెలుస్తోంది. దాంతో నుదుటిపై లోతైన గాయం అయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News