Pawan Kalyan: పవన్ ఎఫెక్ట్... రగిలిపోతున్న పిఠాపురం టీడీపీ శ్రేణులు

Pithapuram TDP cadre on fire after Pawan Kalyan announced his candidature
  • పిఠాపురం అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటన
  • పిఠాపురం నుంచి టీడీపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ
  • పవన్ ప్రకటనతో వర్మ అనుచరుల ఆందోళన
  • టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల దగ్ధం 
జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో, పిఠాపురం టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పిఠాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఇక్కడ్నించి పోటీ చేస్తానని పవన్ ఇవాళ ప్రకటించడంతో, మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. వర్మ అనుచరులు టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ స్థానిక టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. 

పిఠాపురం టికెట్ ఎస్వీఎస్ఎన్ వర్మకే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. వర్మ ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలని అనుచరులు కోరుతున్నారు.
Pawan Kalyan
Pithapuram
SVSN Varma
TDP
Janasena
Elections

More Telugu News