Ch Malla Reddy: బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి

will Malla Reddy and Badra Reddy want to join the Congress party soon
  • ఇటీవల మర్రి రాజశేఖరరెడ్డి కాలేజీ భవనాలను కూల్చివేసిన అధికారులు
  • కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు
  • తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో డీకే శివకుమార్ వద్దకు మల్లారెడ్డి?
బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. తన అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి... అక్కడే కాంగ్రెస్ నాయకుడితో భేటీ అయ్యారు. ఇటీవల మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో వాటిని కూల్చేశారు. 

మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీలో చేర్చుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఆయన కర్ణాటక నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తాను పార్టీ మారేది లేదని ఇటీవలే మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతలోనే బెంగళూరుకు వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Ch Malla Reddy
DK Shivakumar
Congress
Telangana

More Telugu News