Sanjeev Kumar: టీడీపీలోకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

Kurnool MP Sanjeev Kumar Joins TDP
  • చంద్రబాబు సమక్షంలో చేరిక
  • అనుచరులతో సహా పార్టీ మారిన ఎంపీ సంజీవ్ 
  • పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేశ్ కూడా..

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ నుంచి పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కర్నూలు ఎంపీ, వైసీపీ నేత సంజీవ్ కుమార్ గురువారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ సంజీవ్ కు కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి, తదితరులు టీడీపీలోకి చేరారు.

  • Loading...

More Telugu News