Samantha Padcast: సమంత పాడ్ కాస్ట్ పై ప్రముఖ డాక్టర్ మండిపాటు

Samantha Misleading Her Followers On Detoxing The Liver Says The Liver Doctor
  • అవగాహన లేమితో ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపణ
  • వెల్ నెస్ కోచ్ తో పలు సూచనలు చెప్పించిన సమంత
  • డాండెలిన్ తో కాలేయం పదిలంగా ఉంటుందనడంపై డాక్టర్ అభ్యంతరం
ప్రముఖ హీరోయిన్ సమంత ఇటీవల పాడ్ కాస్ట్ ప్రారంభించి జనాలలో హెల్త్ అవేర్ నెస్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ వెల్ నెస్ కోచ్ తో పలు సూచనలు చెప్పించింది. దీనిని సోషల్ మీడియాలో విడుదల చేయడంతో వైరల్ గా మారింది. ఈ పాడ్ కాస్ట్ లో కాలేయ ఆరోగ్యానికి డాండెలిన్ (పూల మొక్క) చాలా బాగా ఉపకరిస్తుందని సదరు వెల్ నెస్ కోచ్ చెప్పారు. తాజాగా ఈ పాడ్ కాస్ట్ పై కాలేయ వ్యాధి నిపుణుడు ఒకరు సోషల్ మీడియాలో స్పందించారు. మెడిసిన్ చదివి, కాలేయవ్యాధి వైద్యుడిగా పదేళ్లుగా రోగులకు సేవ చేస్తున్నానని తన గురించి చెప్పుకున్నాడు.

సమంత పాడ్ కాస్ట్ జనాలను తప్పుదోవ పట్టించేలా ఉందని, డాండెలిన్ తో కాలేయానికి మేలు కలుగుతుందనేందుకు ఎలాంటి ఆధారం లేదని వివరించారు. ఈ పాడ్ కాస్ట్ మొత్తం అసంబద్ధంగా, వారి అవగాహనా రాహిత్యం వెల్లడించేలా ఉందని మండిపడ్డారు. శరీరం పనితీరు గురించి కనీస అవగాహన లేకుండా నోటికొచ్చింది చెప్పాడంటూ సదరు వెల్ నెస్ కోచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలుకలపై జరిపిన ప్రయోగాత్మక పరిశోధనలో డాండెలిన్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్లు తేలిందని కాలేయ వ్యాధి వైద్యుడు తన పోస్టులో వివరించారు. డాండెలిన్ ఒక రకమైన కూరగాయ అని, దీనిని సలాడ్ లో ఉపయోగిస్తారని చెప్పారు. సుమారు 100 గ్రాముల డాండెలిన్ తీసుకుంటే శరీరానికి రోజువారీ అవసరమయ్యే పొటాషియంను 10 నుంచి 15 శాతం తీరుస్తుందని వివరించారు. మూత్రం ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతుందని తెలిపారు. జీర్ణక్రియను మెరుగు పరుస్తుందని మరికొంతమంది చెబుతున్నారని వివరించారు.

అయితే, ఇవేవీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, డాండెలిన్ ప్రయోజనాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్ చెప్పుకొచ్చారు. మనుషులపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదని తెలిపారు. ఇవేవీ తెలియకుండా, తెలుసుకోకుండా సమంత తన ఫాలోవర్లను తప్పుదోవ పట్టించేలా పాడ్ కాస్ట్ చేసిందని ఆరోపించారు. సమంత పాడ్ కాస్ట్ విన్న జనం ఆరోగ్యం కోసమంటూ డాండెలిన్ ను తీసుకుంటే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా డాండెలిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సూచించారు.
Samantha Padcast
Detoxing Liver
Misleading
Liver Doctor
Twitter

More Telugu News