KCR: కేసీఆర్ అన్న కొడుకుపై భూకబ్జా కేసు నమోదు

Land grabbing case registered against KCR brothers son
  • రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్ లో కేసు నమోదు
  • 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నించినట్టు కేసు
  • కన్నారావు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు (కల్వకుంట్ల తేజేశ్వర్ రావు)పై భూకబ్జా కేసు నమోదయింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఆదిభట్ల పీఎస్ పరిధిలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్నొన్నారు. కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను తొలగించి, హద్దు రాళ్లను పెట్టినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 38 మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 35 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
KCR
BRS
Brother
Son
Land Grabbing
Case

More Telugu News