Prathibha Patil: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

E President Pratibha Patil hospitalised in Pune
  • బుధవారం పూణెలోని భారతి ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి
  • పాటిల్‌కు జ్వరం, కొద్దిపాటి ఇన్ఫెక్షన్  ఉందన్న వైద్యులు
  • ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని పూణెలోగల భారతీ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యంపై అక్కడి వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రతిభా పాటిల్‌కు జ్వరంతో పాటు ఛాతిలో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. 

ప్రతిభా పాటిల్ భారత దేశ తొలి మహిళా రాష్ట్రపతి అన్న విషయం తెలిసిందే. 2007-12లో ఆమె భారత రాష్ట్రపతిగా సేవలందించారు.
Prathibha Patil
Pune

More Telugu News