BJP: ఉత్తర ప్రదేశ్‌లో 80కి గాను 77 చోట్ల బీజేపీ గెలిచే అవకాశం: న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడి

  • ఉత్తర ప్రదేశ్‌లో ఇండియా కూటమికి 2, బీఎస్పీకి ఒక సీటు వచ్చే అవకాశముందన్న సర్వే 
  • తమిళనాడులో 5, కేరళలో 2 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం 
  • బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, యూపీలలో బీజేపీ క్లీన్ స్వీప్ అని వెల్లడి 
NDA projected to win 77 seats in UP

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్ సభ స్థానాలకు గాను 77 చోట్ల గెలిచే అవకాశముందని న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. 2014లో యూపీలో బీజేపీ 72, 2019లో 62 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా 77 చోట్ల బీజేపీయే గెలుస్తుందని ఈ సర్వే విశ్లేషించింది. ఇండియా కూటమి రెండు స్థానాల్లో, బీఎస్పీ ఒక స్థానంలో గెలిచే అవకాశముందని తెలిపింది. అయోధ్య రామాలయ నిర్మాణం దేశానికి గర్వకారణంగా, ఐక్యతకు చిహ్నంగా భావిస్తారా? అని యూపీలో ప్రశ్నించగా 64 శాతం మంది అవునని చెప్పగా, 20 శాతం మంది మాత్రమే కాదని చెప్పారు.

న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ ఈ రోజు 9 రాష్ట్రాల్లోని సర్వే ఫలితాలను వెల్లడించింది. బీజేపీ దక్షిణాదిన గతంలో కంటే కాస్త పుంజుకున్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది. బీజేపీ తమిళనాడులో 5 సీట్లు, కేరళలో 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. 543 లోక్ సభ స్థానాలకు గాను 242 స్థానాలకు సర్వే ఫలితాలను వెల్లడించింది. వీటిలో ఎన్డీయే కూటమి 174 సీట్లు, ఇండియా కూటమి 67 సీట్లు, ఇతరులు 7 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. 

తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరికి ఎన్ని సీట్లు రావొచ్చునంటే...?

1. బీహార్ (40) - NDA 38, INDIA 2
2. కేరళ (20) - UDF 14, LDF 4, BJP 2
3. మధ్యప్రదేశ్ (29) - BJP 28, INDIA 1
4. తమిళనాడు (39) - INDIA 30, BJP 5, ADMK 4
5. హర్యానా (10) - BJP 10, INDIA 0
6. హిమాచల్ ప్రదేశ్ (4) - BJP 4, INDIA 0
7. పంజాబ్ (13) - AAP 1, INDIA 7, BJP 3, ఇతరులు 2
8. ఢిల్లీ (7) - BJP 7, INDIA 0
9. ఉత్తర ప్రదేశ్ (80) - BJP 77, INDIA 2, ఇతరులు 1

More Telugu News