Raghu Rama Krishna Raju: విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju latest comments on Vishnu Vardhan Reddy issue
  • ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ
  • ఈసారి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశిస్తున్న వైనం
  • నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణు చెబుతున్నట్టు సమాచారం ఉందని వెల్లడి
ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి మద్దతుతో బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అధిష్ఠానానికి చెబుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని రఘురామ వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తనకు తెలుసని అన్నారు. 

విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ అని వ్యాఖ్యానించారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ విష్ణు అస్త్రాన్ని వాడారని వెల్లడించారు. నాకు టికెట్ లభించకుండా చేసేందుకు విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగన్ అని ఆరోపించారు. 

విష్ణువర్ధన్ రెడ్డిది కదిరి... నాది నరసాపురం... నా నియోజకవర్గంతో విష్ణువర్ధన్ కు ఏం పని? నాకు టికెట్ ఇస్తే జగన్ కు భయం ఎందుకు? అని రఘురామ సూటిగా ప్రశ్నించారు.
Raghu Rama Krishna Raju
Vishnu Vardhan Reddy
BJP
Narasapur
TDP-JanaSena-BJP Alliance

More Telugu News