Komatireddy Venkat Reddy: అందుకే అసెంబ్లీ ఫలితాల రోజే కేసీఆర్ నడుము విరగ్గొట్టి దేవుడు శిక్షించాడు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy hot comments on kcr
  • టానిక్ షాపులు, మందు షాపులు, కాళేశ్వరం పేరుతో దోపిడీ చేశారని ఆరోపణ
  • కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందని వెల్లడి
  • కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దళిత ముఖ్యమంత్రి అన్న మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శ
హైదరాబాద్‌లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసి దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాశనం చేశారని... అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజనే ఆయన నడుము విరగ్గొట్టి దేవుడు శిక్ష వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బుల ఆశతో కేసీఆర్ అల్లుడు, కొడుకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లోకి వెళితే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిండి, ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయాల్సిందన్నారు. 

రోజుకు నలుగురు పార్టీ మారుతుంటే బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది? అని ప్రశ్నించారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ మొదటి అయిదేళ్లలో మహిళా మంత్రి లేని రాష్ట్రం కాబట్టే వారి ఉసురు తగిలి కరవు వచ్చిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదని... ఎంపీ ఎన్నికల్లో ఈసారి ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు.
Komatireddy Venkat Reddy
Congress
BRS
KCR

More Telugu News