retail inflation: ఫిబ్రవరిలో అతి స్వల్పంగా తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

Indias retail inflation eases to 5 point 9 per cent in February
  • జనవరిలో 5.10 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గుదల
  • 8.3 శాతం నుంచి 8.66 శాతానికి ఆహార ధరల ద్రవ్యోల్బణం
  • గణాంకాలను విడుదల చేసిన స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ 

ఫిబ్రవరి నెల రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కాస్త చల్లబడింది. జనవరిలో 5.10 శాతం నుంచి 5.09 శాతానికి అతిస్వల్పంగా తగ్గింది. ఈ మేరకు ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంగళవారం సాయంత్రం గణాంకాలను విడుదల చేసింది. ఆహార ధరల కేటగిరి రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.66 శాతంగా నమోదయిందని, అంతక్రితం నెలలో ఇది 8.3 శాతంగా ఉందని తెలిపింది. కాగా ఫిబ్రవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.02 శాతానికి తగ్గవచ్చంటూ ‘రాయిటర్స్ పోల్’లో ఆర్థికవేత్తలు విశ్లేషించినప్పటికీ అంచనాలు తప్పాయి. అయితే ఆర్బీఐ పరిమితి 2-6 శాతం మధ్య కట్టుతప్పకుండా ఉంది.

  • Loading...

More Telugu News