IT Employee: హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని చితకబాదిన యువకులు

Unknown youth attacked IT employee in Hyderabad
  • అనురాగ్ యూనివర్శిటీ వద్ద ఘటన
  • టీసీఎస్ లో పని చేస్తున్న బాధితుడు కుర్వ నవీన్ కుమార్
  • వెంబడించి చితకబాదిన గుర్తు తెలియని యువకులు

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై గుర్తు తెలియని యువకులు దాడి చేసిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న కుర్వ నవీన్ కుమార్ పై 8 మంది యువకులు దాడికి పాల్పడ్డారు. కొర్రెముల చౌరస్తా వరకు ఆయనను వెంబడించి చితకబాదారు. కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. దాడి తర్వాత కారును వారు తీసుకెళ్లారు. నరపల్లి నందనవనం వద్ద కారును వదిలిపెట్టి పారిపోయారు. బాధితుడు టీసీఎస్ లో పని చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News