KTR: కేన్స్ గుజరాత్ కు వెళ్లిపోతోందనే వార్త చూస్తుంటే నిజంగా బాధగా ఉంది: కేటీఆర్

Kaynes moving to Gujarat is truly saddening says KTR
  • కేన్స్ సెమీకాన్ గుజరాత్ కు తరలిపోతోందంటూ ఓ పత్రికలో కథనం
  • కేన్స్ ను తెలంగాణకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామన్న కేటీఆర్
  • వారు తెలంగాణలోనే ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్య
సెమీ కండక్టర్ల సంస్థ కేన్స్ సెమీకాన్ తెలంగాణ నుంచి గుజరాత్ కు తరలిపోతోందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చేలా కేన్స్ ను ఒప్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని చెప్పారు. కొంగర కలాన్ లోని ఫాక్స్ కాన్ ప్లాంట్ పక్కనే భూమి కావాలని వారు కోరితే... 10 రోజుల లోపే తాము అక్కడ భూమిని కేటాయించామని తెలిపారు. ఇప్పుడు వారు గుజరాత్ కు వెళ్తున్నారనే వార్త చూస్తే బాధగా ఉందని చెప్పారు. కేన్స్ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం చేరదీసి, వారిని ఒప్పించి తెలంగాణలోనే ఉండేలా చూస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
KTR
BRS
Congress
Kaynes
Telangana
Gujarat

More Telugu News