Ambati Rambabu: ఎక్కడ నెగ్గాలో తెలియదు.. పవన్ కల్యాణ్ పై అంబటి విమర్శ

Ambati Rambabu Viral Tweet On Janasena Chief Pawan Kalyan
  • తగ్గాల్సింది ఎక్కడో ఆయనకు అస్సలు తెలియదంటూ వ్యంగ్యం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మంత్రి అంబటి ట్వీట్
  • ఘాటుగా జవాబిస్తున్న జనసైనికులు
జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. పవన్ సినిమా అత్తారింటికి దారేది డైలాగ్ కు పేరడీ వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ‘ఎక్కడ నెగ్గాలో తెలియదు.. ఎక్కడ తగ్గాలో అస్సలు తెలియదు’ అంటూ అంబటి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి జనసైనికులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల మంత్రి అంబటి మాట్లాడిన వీడియోతో కామెంట్లు పెడుతున్నారు. సిద్ధం సభలో అంబటి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోసగాడంటూ నోరుజారాడు. ఈ వీడియో క్లిప్పింగ్ ను జనసైనికులు వైరల్ గా మార్చేశారు. పవన్ కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘పోలవరం పూర్తి చేయలేని అసమర్థుడు, కేంద్ర పథకంలో భాగంగా సొంత జిల్లాలో 60% ఇళ్ళకి కొళాయి కనెక్షన్లు ఇవ్వలేని అసమర్థుడు.. శవం దగ్గర చిల్లర ఏరుకోవడంలో ఆరితేరినవాడు’ అంటూ అంబటి రాంబాబును విమర్శిస్తూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఎక్కడ ముంచాలో తెలిసినోడు, ఎక్కడ ఏసేయాలో ఇంకా బాగా తెలిసినోడు ఎవడు? అంటూ మరో నెటిజన్ అంబటి రాంబాబును ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. దీనికి సిద్ధం సభలో అంబటి మాట్లాడిన వీడియో క్లిప్ జత చేస్తూ.. మీ అధినాయకుడు అని నువ్వు ఏకంగా స్టేజీ మీదే చెప్పినట్లున్నావు అని విమర్శించాడు.
Ambati Rambabu
Pawan Kalyan
Attarintiki Daredi
movie dialogue
Viral Tweet
YSRCP
Janasena news

More Telugu News