Mumbai Indians: కొబ్బరికాయ కొట్టి కొత్త సీజన్ షురూ చేసిన ముంబయి ఇండియన్స్... వీడియో ఇదిగో!

Mumbai Indians starts proceedings in traditional way for IPL new season
  • మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్
  • ముంబయి ఇండియన్స్ కు కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా
  • ప్రాక్టీసు మొదలుపెట్టిన ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు
  • దైవ పూజతో సన్నాహాలు మొదలు
మరి కొన్ని రోజుల్లో దేశంలో ఐపీఎల్ క్రికెట్ వినోదానికి తెరలేవనుంది.. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఐపీఎల్ ప్రధాన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబయి ఇండియన్స్ కూడా ప్రాక్టీసు షురూ చేసింది. 

ఇవాళ ముంబయిలో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా దేవుడికి పూజ చేసి కొత్త సీజన్ లో సన్నాహాలకు నాంది పలికాడు. హిందూ సంప్రదాయాల గురించి పెద్దగా తెలియని కోచ్ మార్క్ బౌచర్ కొబ్బరికాయ కొట్టగా, అది ముక్కలు ముక్కలైపోయింది. దాంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అయితే, హార్దిక్ పాండ్యా నవ్వుతూ, అదేం పెద్ద విషయం కాదన్నట్టు కోచ్ ను సముదాయించాడు. 

దీనికి సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.
Mumbai Indians
Hardik Pandya
IPL-2024
New Season

More Telugu News