Arjun Kalyan: నేను హీరోను అని చెప్పారు .. ట్రైలర్ చూసిన తరువాత మోసపోయానని అర్థమైంది: బిగ్ బాస్ అర్జున్ కల్యాణ్! 

  • అర్జున్ కల్యాణ్ కి యూత్ లో క్రేజ్ 
  • బిగ్ బాస్ తరువాత బిజీ అయిన నటుడు
  • రీసెంటుగా చేసిన సినిమా పట్ల అసంతృప్తి 
  • తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించారని ఆవేదన   

Arjun kalyan Interview

అర్జున్ కల్యాణ్ .. అనే పేరు వినగానే 'బిగ్ బాస్ సీజన్ 6' గుర్తుకు వస్తుంది. సీజన్ 6లో అర్జున్ కల్యాణ్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. అలాంటి అర్జున్ కల్యాణ్ ప్రస్తుతం ఒక వైపున సినిమాలతో .. మరో వైపున సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీతో మాట్లాడుతూ, రీసెంటుగా తాను చేసిన సినిమాను గురించి మాట్లాడాడు. 

" ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత, ఈ సినిమాలో నేను హీరోనా? సైడ్ కేరక్టర్ నా? అనే డౌట్ ను చాలామంది అడిగారు. అదే ఫీలింగ్ మా వాళ్లకి కూడా వచ్చింది. నాకు చెప్పిన కథ వేరు .. ఆ తరువాత వేరేవి యాడ్ చేశారు. ఈ సినిమాకి కథ .. కర్త .. కర్మ .. హీరో .. విలన్ .. అన్నీ దర్శకుడే.  మెయిన్ లీడ్ గా ఆయనే కనిపిస్తాడు. నాకంటే ఆయన పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు ఆ తరువాత తెలిసింది" అన్నాడు. 

ఈ కథలోని కొన్ని సెగ్మెంట్స్ ను నాకే కాదు .. హీరోయిన్ ఖుషితకి కూడా చెప్పలేదు. ఆయనకి ఒక ఫ్లాష్ బ్యాక్ .. లవ్ స్టోరీ .. ఒక పాట .. ఇవన్నీ ఉన్నట్టుగా ముందు చెప్పలేదు.  ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాతనే అసలు విషయం మాకు అర్థమైంది. ఒక రకంగా నేను డైరెక్టర్ వలన మోసపోయాననే చెప్పాలి. ఎందుకిలా చేశావని నేను అడిగితే, ఆయన ఏదో క్రియేటివ్ రీజన్స్ చెప్పాడు. ఫైనల్ గా ఈ సినిమాకు నేను డైరెక్టర్ ను .. నా ఇష్టం అన్నాడు" అని చెప్పాడు. 

More Telugu News