Tirumala: తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపం నుంచి వెళ్లిన మూడు హెలికాప్టర్లు

Three helicopters spotted in Tirumula skies
  • తిరుమల గగనతలంలో విమానాలు, హెలికాప్టర్లు వెళ్లడం నిషిద్ధం
  • అయినప్పటికీ పలుమార్లు నియమోల్లంఘన 
  • ఇవాళ బాలాజీనగర్, రాంభగీచ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు 

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతలంలో కొంతకాలంగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం శ్రీవారి ఆలయంపై గానీ, సమీపంలో గానీ విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణించడం నిషిద్ధం. అయినప్పటికీ పలుమార్లు తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి. నేడు, శ్రీవారి ఆలయానికి సమీపంలో మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. ఈ హెలికాప్టర్లు తిరుమల బాలాజీనగర్, రాంభగీచ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడాన్ని భక్తులు గమనించారు. ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం అవుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీటీడీ ఈ అంశాన్ని విమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లాలని భక్తులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News