David Miller: ప్రేయ‌సిని పెళ్లాడిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ మిల్లర్

David Miller gets married to his longtime girlfriend Camilla Harris
  • చిరకాల స్నేహితురాలు కెమిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకున్న డేవిడ్ మిల్ల‌ర్
  • కేప్ టౌన్ వేదిక‌గా ఘ‌నంగా వివాహ వేడుక‌
  • కొత్త‌ జంట‌కు అభిమానుల‌ శుభాకాంక్ష‌లు
  • గుజరాత్ టైటాన్స్ 2022 ఐపీఎల్‌ టైటిల్ గెల‌వడంలో డేవిడ్ మిల్ల‌ర్ కీ రోల్‌ 
దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన చిరకాల స్నేహితురాలు కెమిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యాన్ని కెమిల్లా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది. కేప్ టౌన్ వీరి వివాహ వేడుక‌కు వేదిక‌యింది. స్టెల్లెన్‌బోష్ న‌గ‌రంలోని ముర‌టీ వైన్ ఎస్టేట్‌లో కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల‌ మ‌ధ్య త‌మ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింద‌ని ఆమె పేర్కొంది. ఎంతో సుందరమైన ప్ర‌దేశంలో భారీగా విచ్చేసిన‌ అతిథుల మ‌ధ్య త‌మ వివాహం జ‌ర‌గ‌డం జీవితంలో మరపురాని క్షణాన్ని సృష్టించిందని ఈ సంద‌ర్భంగా కెమిల్లా ఆనందం వ్య‌క్తం చేసింది. పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మార‌డంతో అభిమానులు ఈ కొత్త‌ జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. 

ఇక‌ వైట్-బాల్ క్రికెట్‌లో డేవిడ్‌ మిల్లర్ అసాధారణ ప్రతిభ క‌లిగిన క్రికెట‌ర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌న అద్భుత‌మైన ఆట‌తో అటు జాతీయ జ‌ట్టు దక్షిణాఫ్రికాలో, ఇటు హై-ప్రొఫైల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) రెండింటిలోనూ ప్రశంసలు పొందాడు. గుజరాత్ టైటాన్స్ (జీటీ) 2022 ఐపీఎల్‌ సీజన్‌లో టైటిల్ గెల‌వడంలో మిల్ల‌ర్ ఆట బాగా ఉప‌యోగ‌ప‌డింది.
David Miller
Marriage
Girlfriend
Camilla Harris
South Africa
Cricket

More Telugu News