Team India: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న టీమిండియా

Team India regains top spot in ICC Test Team Rankings
  • ఇంగ్లండ్ పై 5 టెస్టుల సిరీస్ ను 4-1తో గెలిచిన టీమిండియా
  • తాజా ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
  • ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన రోహిత్ సేన 
టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇవాళ ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ స్పాట్ ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను 4-1తో చేజిక్కించుకున్న టీమిండియా... తాజా ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పీఠంపై అధిష్ఠించింది. నిన్నటిదాకా అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. 

ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ (3), న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), పాకిస్థాన్ (6), వెస్టిండీస్ (7), శ్రీలంక (8), బంగ్లాదేశ్ (9), జింబాబ్వే (10), ఐర్లాండ్ (11), ఆఫ్ఘనిస్థాన్ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఐర్లాండ్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 11వ ర్యాంకుకు చేరుకోగా, ఆఫ్ఘనిస్థాన్ ఒక స్థానం పతనమై టెస్టు జట్ల జాబితాలో అట్టడుగుకు పడిపోయింది.
Team India
ICC Rankings
NO.1
Test
England

More Telugu News