శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే బీజేపీ ఆయనపైకి కూడా ఈడీ-సీబీఐని ఉసిగొల్పేది: కేజ్రీవాల్
- రాముడిని తమ పార్టీలో చేరమని బీజేపీ కోరేదన్న కేజ్రీవాల్
- అందుకు ఆయన నిరాకరిస్తే ఈడీ, సీబీఐని పంపేదని ఎద్దేవా
- దేశంలో తానేదో పెద్ద ఉగ్రవాదిని అయినట్టు పదేపదే సమన్లు పంపిస్తున్నారని ఆగ్రహం
- తనను జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆరోపణ
- కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్ ప్రతిసారి శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ఇవే చివరి ఎన్నికల్లా అనిపిస్తున్నాయని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం ఆప్ నేతలు పదేపదే రాముడిని రాజకీయాల్లోకి లాగడం విచారకరమని అన్నారు.