Nora Fatehi: ముంబై మెట్రోలో నోరా ఫతేహి డ్యాన్స్.. వీడియో ఇదిగో!

Nora Fatehi Dances In Mumbai Metro For Madgaon Express Movie Promotions
  • కొత్త సినిమా ప్రమోషన్ కోసం మెట్రోలో ప్రయాణం
  • అభిమానుల మధ్య స్టెప్పులేసిన బాలీవుడ్ భామ
  • నిత్యం రద్దీగా ఉండే మెట్రోలో ఇదేంపని అంటున్న నెటిజన్లు
బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ముంబై మెట్రోలో డ్యాన్స్ చేశారు. కొత్త సినిమా ప్రమోషన్ కోసం తాజాగా మెట్రోలో ప్రయాణించిన నోరా ఫతేహి.. ప్రభుదేవా ఫేమస్ సాంగ్ ‘ముక్కాల ముక్కాబులా’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసింది. సహనటులతో కలిసి ప్రయాణికులను హుషారెత్తించింది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న నోరా ఫతేహీ తాజాగా మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లతో పాటు ఇతర నటులు ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీబిజీగా గడుపుతున్నారు.

మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ సినిమాలోని ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటకు నోరా ఫతేహి బృందం హుషారెక్కించే స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసి నోరా ఫతేహి అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నోరాను ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మెట్రోలో ఇలా డ్యాన్సులు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. కాగా, నోరా ఫతేహి పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమాలోని ‘మనోహరీ’ సాంగ్ లో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. కిక్‌ 2, షేర్, లోఫర్, ఊపిరి సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో నోరా ఫతేహి ఫాలోవర్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
Nora Fatehi
Madgaon Expres
Mumbai Metro
Movie Promotions

More Telugu News