Nara Lokesh: ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే పొత్తు: నారా లోకేశ్

Nara Lokesh opines on three parties alliance
  • టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారు
  • ఉమ్మడి ప్రకటన చేసిన మూడు పార్టీల అధినేతలు
  • రాష్ట్ర చరిత్రలో ఈ పొత్తు మేలి మలుపు అన్న నారా లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించి ఎట్టకేలకు బీజేపీతో పొత్తును సాధించారు. పొత్తుపై బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. పొత్తు కుదిరిన నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ అనే మూడు శక్తులు ఏకమయ్యాయని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లుగా చీకటిలో మగ్గిపోయిన రాష్ట్రానికి ఈ పొత్తు ఒక ముఖ్యమైన ఘట్టం అని అభివర్ణించారు. ఈ పొత్తు చరిత్రలో నిలిచిపోతుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితకు, ప్రజల జీవితాలకు ఇదొక సానుకూల మేలి మలుపు అని వివరించారు.
Nara Lokesh
Alliance
TDP
BJP
Janasena
Andhra Pradesh

More Telugu News