Chandrababu: ఈ నెల 17 లేదా 18న టీడీపీ-జనసేన-బీజేపీ భారీ సభ... హాజరుకానున్న ప్రధాని మోదీ!

Chandrababu says PM Modi will attend three parties meeting
  • టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు
  • ఢిల్లీ నుంచి టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు
  • భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచన
  • మోదీ హాజరయ్యే ఈ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని నిర్దేశం
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. సీట్ల పంపకం ఒక్కటే మిగిలుంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి ఏపీ నేతలతో మాట్లాడారు. పొత్తు కుదిరిందని, సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు ఇస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు. 

పొత్తు కుదిరిన నేపథ్యంలో, ఈ నెల 17 లేదా 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు. మూడు పార్టీలు కలిసి నిర్వహించే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తారని వివరించారు. ప్రధాని మోదీ పాల్గొనే ఈ సభకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని టీడీపీ నేతలకు సూచించారు.
Chandrababu
Alliance
Narendra Modi
TDP
BJP
Janasena
Andhra Pradesh

More Telugu News